ప్రోస్టేట్ క్యాన్సర్.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు!

వయస్సు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో తరచూ మూత్ర విసర్జన, రాత్రిపూట నిద్రలో లేచి వెళ్లడం వంటి లక్షణాలు కనిపిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశకు సూచనలు కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రాశయం కింద ఉండే ప్రోస్టేట్ గ్రంధిలో ఏర్పడే ఈ క్యాన్సర్, ప్రారంభంలో లక్షణాలు లేకపోవడం వల్ల గుర్తించడం కష్టమవుతుంది. మూత్రంలో రక్తం, వెన్నునొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 50 ఏళ్లు పైబడిన పురుషులు PSA పరీక్షలు చేయించుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్