దీర్ఘకాలం పాటు నీటి ద్వారా శరీరంలోకి చేరే నైట్రేట్, ట్రైహాలోమీథేన్ వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా అన్న విషయంపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. 2008-2013 మధ్య స్పెయిన్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 697 మంది ప్రోస్టేట్ క్యాన్సర్ బాధితుల వివరాలను విశ్లేషించగా 97 మందిలో వేగంగా వ్యాపించే కణితులు ఉన్నాయని తేలింది.