వ్యభిచార ముఠా గుట్టురట్టు.. 16 మంది అరెస్ట్

AP: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని లక్ష్మీనగర్‌లో హైవే పక్కన నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అందిన విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి, వ్యభిచారం చేస్తున్న 8 మంది మహిళలను, 8 మంది విటులను ఎస్సై టి.సుధీర్ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 16 మందిని విచారించారు. కొంతకాలంగా ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ముఠా వెనుక ఎవరున్నారు, కార్యకలాపాలు ఎంతకాలంగా జరుగుతున్నాయి అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕