దళితుల భూములకు రక్షణ.. అంగుళం కూడా తీసుకోం: మంత్రి పొంగులేటి

TG: దళితులు, గిరిజనుల భూములకు ఎలాంటి ఢోకా లేదని, వారి భూముల్లో అంగుళం కూడా తీసుకోబోమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి స్పష్టం చేశారు. భూ రికార్డుల సర్వేను తప్పుగా అర్థం చేసుకోవద్దని, భూ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దళితుల భూములకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ రక్షణ కల్పిస్తుందని, సామాజిక న్యాయం, పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను రెచ్చగొట్టి విషప్రచారం చేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕