వయసు, శ్రమను బట్టి రోజువారీ ప్రోటీన్ అవసరాలు తెలుసుకోండి!

ఆరోగ్యకరమైన, ఫిట్ శరీరానికి ప్రోటీన్ చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు. కండరాల నిర్మాణం, రోగనిరోధక శక్తి పెంపు, చర్మ, జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్ ముఖ్యం. పురుషులకు, మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు వారి వయస్సు, శారీరక శ్రమ స్థాయిని బట్టి రోజుకు అవసరమైన ప్రోటీన్ మోతాదు మారుతుంది. సాధారణంగా, శారీరక శ్రమ చేయని వారికి శరీర బరువులో కిలోగ్రాముకు 0.8 గ్రాములు, శారీరక శ్రమ చేసేవారికి 1.2-1.4 గ్రాములు, అథ్లెట్లకు 1.6-2.2 గ్రాములు అవసరం. గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు కూడా ప్రత్యేక అవసరాలున్నాయి. పిల్లలకు వారి వయస్సును బట్టి 13 గ్రాముల నుండి 52 గ్రాముల వరకు ప్రోటీన్ అవసరం.

సంబంధిత పోస్ట్