"ప్రజా వంచన" పాలనపై ఉద్యమించండి.. మావోయిస్టులు సంచలన లేఖ

వికసిత్ భారత్ పేరుతో కార్పొరేట్ మనువాద, ఫాసిస్ట్ ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లు రద్దు కోసం ఈనెల 26న ప్రతిపక్షాలు నిర్వహించ తలపెట్టిన అఖిల భారత నిరసన కార్యక్రమాల్లో వేలాదిగా పాల్గొని పోరాడాలని పిలుపునిచ్చింది. బిహార్ ఎన్నికల అనంతరం శ్రమ నీతి-2025 పేరుతో కేంద్రం నాలుగు కార్మిక కోడ్లను అమల్లోకి తీసుకువచ్చిందని, ఇవి రాజ్యాంగంలోని 14,16,23 ఆర్టికల్స్ ను ఉల్లంఘించడమేనని, కేంద్ర కార్మిక ఉద్యమాన్ని బలహీనపరచి, విచ్ఛిన్నం చేసేందుకే మనువాదులు ఈ కోడ్ లను తెచ్చారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్