జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనలు.. సుప్రీం కోర్టులో పిల్

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద తరచూ జరిగే నిరసనలు, ఆందోళనల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. నిరసనల కారణంగా ట్రాఫిక్ అంతరాయం, శబ్ద కాలుష్యం, భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సంబంధిత అంశాలపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల అభిప్రాయాలను కోరుతూ తదుపరి విచారణలో కేసును పరిశీలించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్