ఇరాన్‌లో నిత్యావసర ధరల పెరుగుదల, కరెన్సీ పతనం కారణంగా చెలరేగిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 217 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ డాక్టర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక్క టెహ్రాన్ నగరంలోనే ఈ మరణాలు చోటుచుకున్నాయని, దేశవ్యాప్తంగా చూస్తే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చర్యలపై ప్రజల్లో ఆగ్రహం చూపిస్తున్నారు.