ఇరాన్‌లో నిరసనలు.. సాయానికి అమెరికా సిద్ధం

ఇరాన్‌లో ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ప్రజలు సుప్రీం నేత ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్నవారిని హింసించవద్దని ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్, వారిని రక్షించడానికి అమెరికా సిద్ధంగా ఉందని తన ట్రూత్ సోషల్ మీడియాలో తెలిపారు. డిసెంబరు 27న ప్రారంభమైన ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యాపించి, భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య ఘర్షణల్లో ఏడుగురు మరణించి, వంద మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్