ఫ్రాన్స్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి రోడ్లపైకి వచ్చారు. వీరిలో వెయ్యి మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకారులు అనేకచోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లు ప్రయోగించారు. పెరుగుతున్న జీవనవ్యయం, విద్యాసంస్కరణలపై ప్రజలు ఆందోళన బాటపట్టారు.