రేపు కూడా నిరసనలు కొనసాగుతాయి: సీజేపీ

ఢిల్లీలో నిరసనలపై సీజేపీ కీలక ప్రకటన చేసింది. తమ నిరసనలు ఆదివారం కూడా కొనసాగుతాయని CJP నేత అజింక్య షిండే తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. నిరసనకారులు జంతర్ మంతర్‌కు ర్యాలీ చేస్తారని చెప్పారు. డిమాండ్లు నెరవేరే వరకు అక్కడే ఉంటామని, వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు. తామంతా ఒక్కచోట చేరితే అధికారంపై పట్టు కోల్పోతామని మోదీ ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. తమ లీడర్లు అభిజీత్ దీప్కే, అశుతోష్, సౌరవ్ దాస్ గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕