లార్డ్స్‌లో భారత జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉందని కెప్టెన్ గిల్ వెల్లడించారు. 'సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడారు. టెయిలెండర్లు వీలైనంతసేపు ఆడాలని కోరుకున్నాం. ఐదోరోజు ఇంగ్లండ్ కొత్త వ్యూహాలతో వచ్చింది. టాపార్డర్‌లో ఇంకో 50+ రన్స్ భాగస్వామ్యం ఉంటే బాగుండేది. మేము చాలా మంచి క్రికెట్ ఆడాం. ఇకపై ఈ సిరీస్ మరింత రసవత్తరంగా మారబోతోంది. బుమ్రా తర్వాతి టెస్టులో ఉంటారా, లేదా? అనేది త్వరలో తెలుస్తుంది' అని గిల్ పేర్కొన్నారు.