ఎన్‌ఎంసీ 2025–-26 విద్యా సంవత్సరానికి మెడికల్ పీజీ సూపర్ స్పెషాలిటీ (డీఎం/ఎం. సీహెచ్) కోర్సుల్లో ప్రవేశాల కోసం తాత్కాలిక సీట్ల జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, విద్యా సంస్థల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ఎన్‌ఎంసీ వెల్లడించింది. కాలేజీలు తమ వివరాలను సరిచూసుకుని, అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా ఆధారాలతో monitoring.cell@nmc.org.in మెయిల్ కు ఫిర్యాదు చేయాలని సూచించింది.