PSLను వీడి IPLకు వెళ్లిన ఆటగాళ్లపై పీసీబీ కఠిన చర్యలు

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్ ప్రారంభం నుంచే ఇంధన సంక్షోభం, ఆంక్షల కారణంగా వివాదాలతో సతమతమవుతోంది. తొలి మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆటగాళ్లు, కామెంటేటర్లు ఐపీఎల్ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతుండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌ను వదిలి వెళ్లేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు ఇంగ్లాండ్ మాజీ కామెంటేటర్ కూడా ఐపీఎల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్