ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పబ్‌జీ (PUBG) మొబైల్ సృష్టికర్తల్లో ఒకరైన ఫరూఖ్ అహ్మద్ కెనడాలోని కాల్గరీలో జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదంలో మరణించారు. 28 ఏళ్ల ఫరూఖ్ మరణవార్తను పబ్‌జీ మొబైల్ ఎక్స్ వేదికగా ధృవీకరిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కమ్యూనిటీ ఒక ఆత్మీయుడిని కోల్పోయిందని సంతాపం తెలిపింది. 1998లో పాకిస్తాన్‌లో జన్మించిన ఫరూఖ్, యూట్యూబ్‌లో లక్షలాది మంది సబ్‌స్క్రైబర్‌లను, ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.