అఫ్ఘానిస్తాన్ స్టార్ క్రికెటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి కన్నుమూశారు. ఈ వార్తతో తోటి క్రికెటర్లు ఒమర్జాయ్‌కు సానుభూతి తెలుపుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఒమర్జాయ్, తల్లి మరణంతో టోర్నమెంట్‌ను వీడి స్వదేశానికి వెళ్లే అవకాశం ఉంది. ఒమర్జాయ్ తల్లి మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.