కెనడాలోని టొరంటోలో పంజాబ్‌కు చెందిన 27 ఏళ్ల అమన్‌ప్రీత్ సైనీ దారుణ హత్యకు గురైంది. లింకన్ ప్రాంతంలోని పార్కులో ఆమె మృతదేహం తీవ్ర గాయాలతో లభ్యమైంది. ఈ కేసులో అనుమానితుడిగా గుర్తించిన భారతీయ యువకుడు మన్‌ప్రీత్ సింగ్ ఇప్పటికే కెనడా నుంచి భారత్‌కు పారిపోయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. కెనడా అధికారులు నిందితుడి ఆచూకీ కోసం భారత దర్యాప్తు సంస్థలను ఆశ్రయించారు. హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.