ఈనెల 17 నుంచి తిరుమలలో పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహులు పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలను జనవరి 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మొదటి రోజు సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, పీఠాధిపతుల ఆశీర్వచనాలు, సంకీర్తనమాల ఉంటాయి. జనవరి 18న అలిపిరి వద్ద విగ్రహానికి పుష్పమాల, శ్రీవారి ఆలయం నుంచి నారాయణగిరి వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్‌సేవ జరుగుతాయి. చివరి రోజు 19న సుప్రభాతం, సామూహిక భజన, నగర సంకీర్తన ఉత్సవాలు ముగుస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్