భక్తులతో కిక్కిరిసిన పూరీ క్షేత్రం

జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పూరీ శ్రీక్షేత్రం భక్తులతో నిండిపోయింది. సోమవారం ఉదయం నుంచే లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివచ్చారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా వేడుకలను వైభవంగా జరిపారు. దేవాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

సంబంధిత పోస్ట్