రెండో భర్తతోనూ విడాకులు తీసుకున్న ‘పుష్ప’ సినిమా సింగర్.. కారణమిదే

బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ తన రెండో భర్త గౌతమ్ హతిరమాని నుండి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2022, మే 20న లండన్‌లో వీరి వివాహం జరిగింది. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, ఈ క్లిష్ట సమయంలో తమ గోప్యతను గౌరవించాలని సోషల్ మీడియా వేదికగా ఆమె కోరారు. విడాకులకు గల కచ్చితమైన కారణాలను ఆమె వెల్లడించలేదు. కనికా గతంలో రాజ్ చందోక్‌ను వివాహం చేసుకుని, 2012లో విడిపోయిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕