అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధ విరమణ ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం ఈ ప్రణాళికను అంగీకరించడానికి సిద్ధంగా లేరని, దీనిపై తాను నిరాశగా ఉన్నానని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ట్రంప్ ప్రణాళికలో భాగంగా ఉక్రెయిన్ తన భూభాగంలో కొంత భాగాన్ని రష్యాకు అప్పగించాల్సి ఉంటుంది, అలాగే నాటోలో చేరకూడదు. అయితే, తమ భూభాగాన్ని వదులుకునేది లేదని, నాటోలో చేరడం తమ భవిష్యత్ భద్రతకు అవసరమని జెలెన్‌స్కీ ప్రభుత్వం స్పష్టం చేసింది.