రెండు రోజుల భారత్ పర్యటన ముగించుకొని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చిన అధికారిక విందు అనంతరం ఆయన మాస్కోకు బయల్దేరారు. భారత్ పర్యటనలో భాగంగా, ఇవాళ జరిగిన 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ వాణిజ్యం, రక్షణరంగం సహా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ చర్చల అనంతరం ఇరువురు నేతల సమక్షంలో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి.