పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ఎగుమతులను తగ్గించిన ఖతార్, అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదరడంతో హర్మూజ్ తిరిగి తెరుచుకోగానే ప్రపంచదేశాలకు చమురు ఎగుమతులను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఖతార్ ఒక్క ఖాళీ నౌకను కూడా గల్ఫ్‌లోకి తిరిగి తీసుకురాలేదు. దీంతో రెండు నెలల్లోగా తన ఎగుమతి సామర్థ్యాన్ని వీలైనంత వేగంగా పునరుద్ధరించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటుంది. ఖతార్‌లోని లఫాన్ చమురు క్షేత్రం ప్రపంచంలోనే గ్యాస్ వాణిజ్యానికి ఆయువుపట్టుగా ఉంది.