యాదగిరి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్.కె. సాగర్

జనసేన తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ ఆర్.కె. సాగర్, యాదగిరి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందిని చైతన్యపరిచిన ఒక కలం నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం బాధాకరమని ఆయన అన్నారు. యాదగిరి తన వ్యాఖ్యలపై సినీ లోకానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే వారికి మనఃసాక్షి లేనట్లేనని సాగర్ పేర్కొన్నారు. మాట్లాడే ముందు రాజ్యాంగ విలువలు, హక్కుల గురించి తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. భవిష్యత్తులో తెలంగాణలో జనసేన పార్టీ బలంగా ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్