రూ.2 కోట్లతో ఆస్పత్రి కట్టించిన ఆర్.నారాయణమూర్తి (వీడియో)

ఆర్. నారాయణ మూర్తి స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'యూనివర్సిటీ (పేపర్ లీక్)' ఆగస్టు 22న విడుదలవుతోంది. ఈ మూవీ ప్రెస్‌మీట్‌లో ఆర్.నారాయణమూర్తి గుప్త దానాల గురించి గోరటి వెంకన్న తెలిపారు. తన ఊర్లో రూ.2 కోట్లతో ఆస్పత్రి నిర్మించి తన పేరుగానీ, తన తల్లిదండ్రుల పేరు గానీ పెట్టుకోలేదని తెలిపారు. ఓటమి లేకుండా, ఒకే భావజాలంతో, హింసను ప్రోత్సహించకుండా చిత్రాలు తీసిన అరుదైన వ్యక్తి అని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్