TG: హైదరాబాద్ శివారు ప్రాంతం జీనోమ్ వ్యాలీ పీఎస్ పరిధిలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఓ బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి చెందారు. R15 బైక్ పై ఇద్దరు వ్యక్తులు అతి వేగంగా వచ్చి రోడ్డు వెంబడి ఉన్న చెట్టును ఢికొట్టారు. దీంతో వారు గాల్లోకి ఎగిరిపడి చనిపోయారు. బైక్ పూర్తిగా ధ్వంసం అయింది. మృతులు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.