TG: మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. జర్నలిస్టులపై దాడి ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఓ జర్నలిస్టుపై మోహన్ బాబు ఆయన ఇంటి వద్ద దాడి చేయడంతో తలకు గాయం అయ్యింది. దీంతో జర్నలిస్టు సంఘాల డిమాండ్ మేరకు మోహన్ బాబుకు సీపీ నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.