భారత నౌకాదళానికి చెందిన అతిపెద్ద విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై రఫేల్ మెరైన్ యుద్ధ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. భారత నౌకాదళంలోకి ఈ విమానాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియలో ఇది కీలక ముందడుగుగా నిలిచింది. విక్రాంత్‌పై కార్యకలాపాలకు అవసరమైన మార్పులను అంచనా వేసేందుకు గోవాలో రఫేల్ మెరైన్ విమాన పరీక్షలు నిర్వహిస్తున్నారు. విమాన వాహక నౌకతో యుద్ధ విమానం అనుకూలతను ధ్రువీకరించి, మోహరింపునకు సిద్ధం చేయడం ఈ పరీక్షల ప్రధాన లక్ష్యం.