దివంగత నటి శ్రీదేవి గురించి తన అనుబంధాన్ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పంచుకున్నారు. ఆమె మరణంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన చివరి చిత్రం 'మామ్' ఆడియో వేడుకలో శ్రీదేవి మళ్ళీ కలిసి సినిమా చేద్దామని కోరినట్లు వివరించారు. కానీ ఆ కోరిక తీరకముందే ఆమె దుబాయ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించడం తనను తీవ్రంగా బాధించిందని రాఘవేంద్రరావు తెలిపారు. 'అంతటి గొప్ప నటి, అతిలోక సుందరి అలా వెళ్లిపోకూడదు. ఆమెలాంటి చావు మరెవరికీ రావొద్దు' అని ఆయన కంటతడి పెట్టుకున్నారు.