TG: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించారు. 'రాహుల్ గాంధీ జీ దో లాక్ నౌకరీ దో' అంటూ X వేదికగా డిమాండ్ చేశారు. 'కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా? యువత ఆశలు, ఆకాంక్షలను చిదిమేశారు. యూత్ డిక్లరేషన్ బోగస్‌గా మారింది. జాబ్ క్యాలెండర్ పత్తా లేదు. కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన అనే మాటను నిలబెట్టుకున్నారు' అని ఫైర్ అయ్యారు.