కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బయటకు రావడానికి ఇబ్బందిగా ఉన్న ఆయన షూస్‌ను స్వయంగా చేతితో పక్కకు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటనతో కాంగ్రెస్ శ్రేణులు తమ నాయకుడికి కులమతాలు, హోదా అడ్డురావని, పెద్దల పట్ల ఆయనకున్న గౌరవానికి ఇది నిదర్శనమని ప్రశంసిస్తున్నాయి.