రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదానికి గురైంది. కోర్టు కేసు విచారణ నిమిత్తం సుల్తాన్‌పూర్ వెళ్తుండగా, కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు, ఒక అంబులెన్స్ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది మరియు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన తీరు మరియు పూర్తి స్థాయి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందుతోంది.

సంబంధిత పోస్ట్

✕
✕