దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ కలకలం రేగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘కనిపించడం లేదు’ (మిస్సింగ్) అంటూ ఆదివారం ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో వెలిసిన పోస్టర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ తాజా విదేశీ పర్యటనను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్‌లో ఈ పరిణామం సరికొత్త మలుపు తిప్పింది. ఢిల్లీలోని ఫిరోజ్‌షా రోడ్డుతో పాటు పలు ప్రధాన కూడళ్లలో రాహుల్ గాంధీ ఫోటోతో కూడిన ‘మిస్సింగ్’ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.