కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. డీలిమిటేషన్ బిల్లు అంశంపై రాహుల్ మాట్లాడతారు. కాగా ఇప్పటికే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఏఐసీసీ చీఫ్ ఖర్గే ప్రకటించారు. దక్షిణాది నుంచి పలు పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. దీంతో రాహుల్ గాంధీ ఏం మాట్లాడబోతున్నారనే ఆసక్తి నెలకొంది.