హైదరాబాద్‌లో నేడు రాహుల్ గాంధీ పర్యటన

TG: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవంబర్ 14న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి భారత్ సమిట్‌–2026 ముగింపు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ప్రపంచ ప్రజాస్వామ్య విలువలు, గ్లోబల్ సౌత్‌–గ్లోబల్ నార్త్ దేశాల మధ్య సహకారంపై చర్చించనున్నారు. అనంతరం ఉదయం 9.45 గంటలకు అమెరికా, ఐరోపా దేశాల ప్రతినిధులతో మరో సమావేశంలో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕