TG: భారత్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఒంటి గంటకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగే గిగ్ వర్కర్ల ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొంటారు. గిగ్ వర్కర్లతో రాహుల్ నేరుగా మాట్లాడనున్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి కొత్త నిబంధనలు ప్రారంభించనున్నారు. అలాగే రాహుల్ చేతుల మీదుగా సంక్షేమ పథకాలు ప్రారంభం కానున్నాయి.