లక్నోలో రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (58) తన కోడలిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అదనపు కట్నం కోసం భర్త, కుటుంబ సభ్యులు వేధించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పెళ్లైన మొదటి రాత్రే మద్యం తాగించి, సిగరెట్ తాగించి చంపడానికి ప్రయత్నించారని, మత్తులో ఉన్నప్పుడు మామ అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. పోలీసులు రైల్వే ఉద్యోగిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.