గుజరాత్‌లోని వడోదరలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. ప్రమాద సమయంలో స్థానికులు ఎవరు లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనపై స్పందించిన రైల్వే శాఖ అధికారు.. చిన్న ఘటనే అంటూ బుకాయించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ బ్రిడ్జి కూలిపోయినా రైళ్ల రాకపోకలు, ట్రాఫిక్‌కు ఆటంకం కాలగలేదని అధికారులు తెలిపారు.