దివ్యాంగుడిపై రైల్వే పోలీస్ దాడి(వీడియో)

దివ్యాంగుడిపై రైల్వే పోలీస్ అధికారి దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. ప్లాట్ ఫామ్ పై పడుకున్న దివ్యాంగుడిని కొడుతూ, కాలితో తన్నాడు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం(డిసెంబరు 3న) రోజునే ఈ ఘటన జరగడంతో నెటిజన్లు సదరు పోలీసుపై మండిపతున్నారు. నిస్సహాయుడైన ఆ దివ్యాంగుడిని తన్నుతూ అమానవీయంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని సమీపంలో ఉన్న నాగ్డా రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్