TG: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారి చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే HYD సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం చినుకులు మొదలయ్యాయి.