లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతోన్న చివరి టెస్టు మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం పడుతుండటంతో 23 ఓవర్ల వద్ద మ్యాచ్‌ను నిలిపివేశారు. అలాగే లంచ్ బ్రేక్ ప్రకటించారు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్.. 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఓపెనర్లు జైస్వాల్ (2), రాహుల్ (14) నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో సుదర్శన్(25), శుభ్‌మన్ గిల్(15) పరుగులతో ఉన్నారు.