హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. గురువారం నాటికి మొత్తం 301 రహదారులు బ్లాక్ చేశారు. 436 విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులకు గురయ్యాయి. 254 నీటి సరఫరా పథకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూన్ 20న మొదలైన వర్షాల కారణంగా మొత్తం 170 మంది మరణించారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, క్లౌడ్ బస్టర్, విద్యుదాఘాతం వంటి ఘటనల కారణంగా 94 మంది మరణించారు. రోడ్డు ప్రమాదాల్లో 76 మంది మృతి చెందారు.