TG: ఎండ వేడిమికి తాళలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ నగర ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనం కల్పించాడు. ఈ మేరకు హైదరాబాద్‌లోని పలు చోట్ల వర్షం మొదలైంది. బోరబండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బాచుపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్, మాదాపూర్, అత్తాపూర్, కార్వాన్, మణికొండ, టోలీచౌకి, హైటెక్ సిటీ, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.