తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కూరుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రానున్న రెండు మూడు గంటల్లో వానలు పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ADLB, జగిత్యాల, గద్వాల్, కొమురం భీమ్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్, RR, SRD, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక మహబూబ్‌నగర్‌లో గరిష్ఠంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు పేర్కొంది.