తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. రాబోయే 2 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే ఆస్కారముందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 5మి.మీ. మేర వర్షపాతం నమోదయ్యే ఆస్కారముందని చెప్పింది. కాగా గంట కిందటి వరకు ఎండలు దంచికొట్టగా కొద్దిసేపటి నుంచి పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.