హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన నిర్ణయాత్మక మూడో వన్డేకు భారీ వర్షం అంతరాయం కలిగించింది. తొలుత వాతావరణం అనుకూలించడంతో ఉదయం 7:32 గంటలకు టాస్ ఉంటుందని, 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని అంపైర్లు వెల్లడించారు. అయితే, ఆ వెంటనే వర్షం మళ్లీ మొదలవ్వడంతో మైదానంలో పిచ్‌పై కవర్లు కప్పారు. దీనివల్ల టాస్ ప్రక్రియ మరికొంత సమయం ఆలస్యం కానుంది.