ఇవాళ్టి మ్యాచ్‌కు కూడా మళ్లీ వర్షం అడ్డంకి!

ఐపీఎల్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించగా.. ఢిల్లీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందే సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మ్యాచ్‌పై ప్రభావం పడే ప్రమాదం ఉంది.

సంబంధిత పోస్ట్