TG: హైదరాబాద్ నగరంలో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షం అర్ధరాత్రి వరకు కొనసాగుతుందని తెలిపింది. షేక్పేట్, టోలిచౌకి, మణికొండ, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, చార్మినార్, బాలానగర్ వంటి ప్రాంతాల్లో వర్షం పడనుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది. వాహనదారులు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.