AP: రాబోయే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములతో కూడిన మెరుపులు సంభవించవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో ఈ వాతావరణం కొనసాగనుంది. వేడి, తేమతో కూడిన అసౌకర్య పరిస్థితులు ఏర్పడవచ్చని సూచించారు.