తెలుగు రాష్ట్రాల్లో 7రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ

తెలుగు రాష్ట్రాలకు జులై 2 నుంచి జులై 8 వరకు 7 రోజుల పాటు భారత వాతావరణ శాఖ (IMD)హెచ్చరికలు జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని IMD విజ్ఞప్తి చేసింది.

సంబంధిత పోస్ట్